Friday, February 12, 2010

ప్రేమ పరవశం

మనసుకి నచ్చిన ఒక తోడు కనులకి వేడుక చేస్తే ఎలాంటివారికైన పరిచయం లేని పదాలపువ్వులు భావాలదారంతో కలిసి కవితల హారమై ప్రేమ మెడలో వేస్తాయి...అందుకే

బాష కరువైన మనసు చుట్టూ
భావాలు అల్లే అందాల బొమ్మరిల్లు

అలసిపోయిన హృదయం కోసం
పదాలు జల్లే పరిమళాల పన్నీటి జల్లు

నిద్దుర రాని కన్నులకోసం
కనురెప్పలు చెప్పే ముచ్చట్ల హరివిల్లు

ప్రేమలో పడ్డ గుండెల కోసం
బందాలు కట్టే అనుబందాల పొదరిల్లు

మధురమైన స్నేహం

ఒక చెంపపై నిశబ్దంగా జారే కన్నీటి చుక్కను తుడవడానికి మరో హృదయం పడే తపనే ప్రేమ అదే చుక్కనే రానివాకుండా ఆరాటపడే హృదయమే స్నేహం

ప్రేమలోని మాధుర్యం


ప్రేమంటే ఊహలు తెలియని వయస్సులో గీసే పిచ్చి గీతలు కాదు నిన్ను చూసాను ప్రేమించాను నువ్వు కూడా ప్రేమించు అని చెప్పడానికి ప్రేమ ఖరీదు కట్టే వస్తువు కాదు అది మన మనసులో నిలిచి ఉండే ఓ మధురమైన అనుబంధానికి ప్రతీక

నీ కోసం

సంధ్యా రాగపు అలవై నను నువ్వు తాకిన వేళ,
చెలియా నీ సింగారపు జడిలో తడిసినాను.

చల్లని సముద్రపు పవనాలు నిను ఆస్వాదించు వేళ,
నా మనసు దోచి నా హృదయ రాణి వైనావే.

బరువేరుగని నా హృదయం బరువేక్కుతుందే,
నీ కోసం ....

స్నేహంలోని సౌందర్యం

మరుమల్లియకన్నా తెల్లనైనది స్నేహం
మాటలతో మై మరపించేది స్నేహం

వెన్నెలకన్నా చల్లనైనది స్నేహం
ఒంటరితనం లో తోడు నీడ గా ఉండేది స్నేహం

మకరంధం కన్నా తీయనైనది స్నేహం
బాధలను మరపించేది స్నేహం

నా భావం, నా భాష్యం, నా హాస్యం, నా లాస్యం
అన్ని నీవే నేస్తం